CLICK ME

Monday 2 September 2013

స్త్రీని ముద్దాడవలసిన ప్రదేశాలేమిటి?

ఎక్కడెక్కడ చుంబిస్తే స్త్రీ పరవశురాలవుతుంది
స్త్రీని ముద్దు పెట్టుకోదగిన ప్రదేశాలు కొన్ని వున్నాయి. ఆ ప్రదేశాలను బట్టే ముద్దుల్లో తేడాలు ఏర్పడుతున్నాయి. ఇక ఆ ప్రదేశాలు ఏమిటంటే
1. నుదురు, 2. ముంగురులు, 3.బుగ్గలు, 4. కళ్ళు, 5. వక్షస్థలం, 6. చన్నులు, 7. పెదవులు, 8నాలుక -
ఈ ఎనిమిది ప్రదేశాలూ ముద్దాడే ముఖ్యమైన ప్రదేశాల్ని ప్రాచీన కామ శాస్త్రాచార్యులు చెప్పారు.
గజ్జలూ, చంకలూ, (బొడ్డూ) భగమూ - ఇవి కూడా ముద్దు పెట్టుకోదగిన ప్రదేశాలే. పైన చెప్పిన ఎనిమిది, ఇవి మూడు - ఇలా మొత్తం పదకొండు చుంబన స్థానాలు.
వీటిని కళాస్థానాలని కూడా అంటారు. అంటే స్త్రీకి మదనోద్రేకం పుట్టించే ప్రదేశాలన్నమాట. ప్రేమానురాగాలు అనుసరించీ, దేశాచారాన్ని బట్టీ ముద్దాడే ప్రదేశాలు ఇంకా చాలా వున్నాయి. అయితే అవి అన్నీ అందరూ ప్రయోగించదగినవి కావని వాత్స్యాయనులు అంటున్నారు.
చుంబనం అంటే - రెండు పెదవులు కలిసి, తన ఇష్టమైన ప్రదేశంలో గట్టిగా ఉంచడం. ఇలా చేసినప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. చుంబించే స్థాన భేదాన్నిబట్టి చుంబనాల్లో భేదాలు ఏర్పడుతాయి. ముద్దు పెట్టుకునేది ముఖ్యంగా పెదవులతోనే కాబట్టి, పెదవులను ముద్దాడడంలో గల విశేషాలను చెపుతున్నారు.
పెదవులు రెండు కదా! క్రింది పెదవి, పై పెదవి. వీటినే అధరోష్ఠం, ఉత్తరోష్ఠం అంటారు. ఈరెండు పెదవులూ కలపడాన్ని సంపుటకం అంటారు. ఇలా మూడు రకాల ముద్దులు ఏర్పడుతున్నాయి. వీటిల్లో కూడా క్రియా కలాపంలో క్రింది పెదవికి ఎక్కువ ప్రాముఖ్యం వుంది కాబట్టి, ముందుగా దాన్ని గురించి చెపుతున్నారు.
ఒక పురుషుడితో ఒక స్త్రీకి పరిచయం వుండి, మాట్లాడగలిగిందిగావున్నా, అతనిపై ఇంకా గట్టి నమ్మకం ఏర్పడలేదు కాబట్టి ఆ కొత్త స్త్రీని కన్యగానే పరిగణించవలసి వుంది. అలాంటి నాయిక విషయంలో నిమితికం, స్పురితకం, ఘట్టితనం - అనే మూడు రకాల ముద్దులు ప్రయోగించాలి.
ఆ పురుషుడు పై స్త్రీకి ఇంకా బాగా నమ్మకం ఏర్పడలేదు కాబట్టి, ఆమె సిగ్గుపడుతూ ఉంటుంది. అయినా పురుషుడు ముద్దు పెట్టుకోమని ఆమెను బలవంతం చేస్తాడు. అప్పుడు స్త్రీ అతని ముఖంపై తన ముఖం పెడుతుంది. కాని సిగ్గు వల్ల ఎలాంటి చేష్టా చెయ్యదు. దీన్నే నిమితకం అంటారు. (ఇక్కడ ముఖం అంటే పెదవులనే అర్ధం.)
పురుషుడు తన అధరోష్ఠాన్ని తన ముఖంపైకి తెచ్చినప్పుడు స్త్రీ సిగ్గుతో జంకుతూ, అతని పెదవిని గ్రహించ గోరుతూనే తన క్రింది పెదవిని కదిలిస్తుంది. పై పెదవి కదల్చడానికి ఉత్సాహపడదు. దాన్ని కూడా కదిల్సినప్పుడే స్త్రీ, పురుషుడి పెదవిని గ్రహించినట్లు అవుతుంది. దీన్నే స్పురితకం అంటారు.
సిగ్గు ఇంకా పూర్తిగా పోని కారణంగా స్త్రీ తన రెండు పెదవులతో పురుషుడి క్రింద పెదవిని గ్రహించి, కళ్ళు మూసుకుని, తన చేతులతో పురుషుడి కళ్ళు మూస్తుంది. నాలుక కొస కదిలిస్తూ, అతని అధరోష్ఠాన్ని రాపిడి చేస్తుంది. దీన్ని ఘట్టితకం అంటారు.
కొత్తగా పరిచయమై బాగా నమ్మకం ఏర్పడిన కన్యల విషయంలో ముద్దుపెట్టుకునే విషయాన్ని గురించి చెప్పారు. ఇక ఇప్పుడు తక్కిన స్త్రీల విషయంలో ముద్దు పెట్టుకునే విధానాలను గురించి వివరిస్తున్నారు.
స్త్రీ తన పెదవులతో పురుషుడి అధరోష్టాన్ని ముద్దాడడంలో నాలుగు రకాలున్నాయి. మొదటిది సమ చుంబనం. అంటే తనకు ఎదురుగా వున్న పురుషుడి క్రింది పెదవిని స్త్రీ ముద్దాడడం. రెండోది తిర్యక్‌ చుంబనం. అంటే రెండు పెదవులూ ముందుకు చాచి, పురుషుడి అధరాన్ని చిగురంటా గ్రహించడం. ఇక మూడోది ఉద్భ్రాన్తం. అంటే పురుషుడి గడ్డాన్ని, శిరస్సును స్త్రీ తన రెండు చేతులతోనూ పట్టుకుని, తన పెదవులు కదిలిస్తూ చుంబించడాన్ని ఉద్భ్రాంతం అంటారు. నాలుగోది అవపీడితకం. అంటే స్త్రీ పురుషులిద్దరూ ఒకళ్ల పెదవులు ఒకళ్ళు స్వేచ్చగా గ్రహించి తనివితీరా అధరామృతాన్ని ఆస్వాదించడం. ఈ అవపీడతకం మళ్ళీ రెండు రకాలు. పెదవులతో మాత్రమే అధరాన్ని గ్రహించి గట్టిగా పీడిస్తే దాన్ని శుద్ధ పీడితకం అంటారు. పెదవినే కాక నాలుక కొనతో కూడా పీడిస్తేదాన్ని చూషణం అనీ, అధరపానం అనీ అంటారు.
అయిదో రకం ముద్దు కూడా ఒకటి వుంది. స్త్రీ తన చేతి బొటన వ్రేలితోనూ, తర్జనితోనూ (చూపుడువేలు) పురుషుడి అధరాన్ని పట్టుకుని, పళ్ళునాటుకోకుండా, పెదవులతో మాత్రం గ్రహించి ముద్దాడితే, అవపీడతకం అంటారు. ఇదే అయిదోరకం ముద్దు.
చేసే పనులలో గల విశేషాలను బట్టి అధరచుంబనాన్ని అయిదు విధాలుగా చెప్పారు

No comments:

Post a Comment